: కనీసం బ్యూటీ పార్లర్ కు కూడా వెళ్లను: అందాల తార రాశిఖన్నా


అందం గురించి పెద్దగా పట్టించుకోనని, కనీసం బ్యూటీ పార్లర్ కు కూడా తాను వెళ్లనని అందాల తార రాశిఖన్నా చెప్పింది. ఇటీవల విడుదలైన ‘సుప్రీమ్’ చిత్రంలో ‘మెగా’ ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ సరసన ఆమె నటించింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాశి ఖన్నా మాట్లాడుతూ, ‘అదృష్టం’ అనే దానిపై తనకు పెద్దగా నమ్మకం లేదని, సినిమా అనేది సమష్టి కృషి అని, ఏ ఒక్కరివల్లో సినిమా హిట్ లేక ఫెయిల్ అవడం అనేది ఉండదని చెప్పింది. తన ఇష్ట ప్రకారమే కథల్ని ఎంచుకుంటానని, ఇతరుల సలహాలు తీసుకోనని పేర్కొంది. కథ నచ్చకపోతే ఎంత రెమ్యూనరేషన్ ఇస్తానన్నా ఒప్పుకోనని, అదే కనుక, కథ బాగుంటే తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తానన్నా అంగీకరిస్తానని రాశిఖన్నా చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News