: గుండెపోటు ముప్పునుంచి రక్షించే త్రీడీ కార్డియాటిక్ టెక్నాలజీ.. పరిశోధకుల మరో ఘనత
అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధకులు గుండెపోటు ముప్పునుంచి రక్షించే త్రీడీ కార్డియాటిక్ టెక్నాలజీ రూపొందించారు. త్రీడీ టెక్నాలజీతో పరిశోధకులు తయారు చేసిన గుండె లాంటి పరికరంతో గుండెపోటును అరికట్టవచ్చని చెబుతున్నారు. ఈ కృతిమ గుండెతో హృద్రోగంతో బాధపడుతోన్న వారిలో గుండెపోటు ముప్పు ఎంతమేరకు ఉంటుందో తెలుసుకోవచ్చంటున్నారు. గుండె పోటు ముప్పు స్థాయిని తెలుసుకొని దాన్ని నివారించే క్రమంలో ఈ త్రీడీ గుండె డాక్టర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. హృదయ కణజాలాలు పాడైన వారికి ఈ త్రీడి హార్ట్ ను అమర్చుతామని, దీంతో గుండె పోటు పొంచి ఉంటే అది సంకేతాలను ఇస్తుందని పరిశోధకులు వివరించారు. ఈ త్రీడీ హార్ట్ పరికరాన్ని ఇప్పటివరకు 21మంది హృద్రోగుల మీద ప్రయోగించామని గుండెపోటు వచ్చే ముప్పుపై సరైన సంకేతాలిచ్చిందని, గుండె పోటు ప్రమాదం నుంచి తప్పించిందని పరిశోధకులు తెలిపారు.