: కేవీపీ నివాసంలో కాంగ్రెస్ దిగ్గజాలు... రహస్య మంతనాలు!
న్యూఢిల్లీలోని కేవీపీ నివాసంలో కాంగ్రెస్ సీనియర్ దిగ్గజాలు సమావేశమై రహస్య మంతనాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వెంటనే ఇవ్వాలని ఆయన రాజ్యసభలో ప్రైవేటు బిల్లును పెట్టడంతో ఆత్మరక్షణలో పడిన బీజేపీ, రాజ్యసభను పదే పది నిమిషాల్లో వాయిదా వేయగా, ఆపై నేతలంతా కేవీపి ఇంట సమావేశమయ్యారు. రేపు రాజ్యసభ సమావేశాలు ముగిసి నిరవధిక వాయిదా పడనుండటంతో, ఈ లోగా అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించినట్టు తెలుస్తోంది.
బిల్లుపై ఓటింగ్ జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే అవకాశాలే అధికం. అదే జరిగితే బీజేపీకి ఇబ్బంది. ఈ నేపథ్యంలోనే రేపు చర్చకు వస్తే ఏలా నడచుకోవాలన్న విషయమై నేతలంతా రహస్యంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. విపక్షాలన్నీ కేవీపీ బిల్లుకు మద్దతివ్వగా, అధికార పక్షంలో భాగంగా ఉన్న తెలుగుదేశం సైతం రెడీ అనక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.