: సుబ్రతారాయ్ ఆస్తుల చిట్టా చూసి దిగ్భ్రాంతి చెందిన సుప్రీంకోర్టు!


సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ వంటి వ్యక్తి రెండేళ్లు తీహార్ జైల్లో ఎందుకు ఉన్నారు? ఆయనకున్న ఆస్తుల చిట్టాను చూసిన తరువాత సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఇది. చెల్లించాల్సిన మొత్తం, ఆయనకున్న ఆస్తితో పోలిస్తే అత్యంత స్వల్పమని గమనించిన ధర్మాసనం, చెల్లింపులు ఇంత ఆలస్యం కావడానికి కారణమేంటో అర్థం కావడం లేదని పేర్కొంది. పెరోల్ ను ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ, రాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ అందించిన ఆస్తుల చిట్టాను నిశితంగా పరిశీలించిన తరువాత సుప్రీం అభిప్రాయమిది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ డావే, ఏకె సిక్రీ లు ఇండియాలో, ఆపై విదేశాల్లో ఉన్న ఆస్తులు, బంగారం, యూరోలు, డాలర్లు, పౌండ్ స్టెర్లింగ్ లు తదితర కరెన్సీల్లో విలువకట్టిన విలువైన కళాఖండాలు తదితరాల వివరాలను చూసి దిగ్భ్రాంతి చెందినట్టు తెలిపారు. ఆరు నెలలు గడువిస్తే, ప్రతి పైసా కూడా చెల్లిస్తారని కోర్టుకు తెలిపారు. వీటిని చూసిన తరువాతనే ఆయనకు మరో ఐదు వారాలు పెరోల్ పొడిగిస్తూ, రూ. 200 కోట్లను సెబీకి చెల్లించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News