: అనుష్క ఏమనుకున్నా విరాట్ కోహ్లీతో డేటింగ్ కు రెడీ అంటున్న హీరోయిన్
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటే మనసు పారేసుకుంటున్న సెలబ్రిటీల జాబితాలో మరో బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ చేరిపోయింది. అతనితో తనకు డేటింగ్ కు వెళ్లాలని ఉందని చెప్పింది. అనుష్క ఏమనుకున్నా తన అభిప్రాయం ఇదేనని అంటోంది. తాను నటించిన తాజా చిత్రం 'అజర్' ప్రచార కార్యక్రమంలో ప్రాచీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో హీరోయిన్ నర్గీస్ ఫక్రీ మాత్రం తనకు సచిన్ అంటే ఇష్టమని, అతనితో డిన్నర్ చేయాలని ఉందని చెప్పింది. కాగా, ఇటీవల విరాట్ అంటే తనకెంతో ఇష్టమని, అతన్ని ప్రేమిస్తున్నానని ఐటం గర్ల్ రాఖీ సావంత్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్లో దూసుకుపోతున్న విరాట్ ను ఇష్టపడుతున్నామని చెబుతున్న వారి జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.