: అజారుద్దీన్ తో అఫైర్ గురించి అడిగితే అగ్గిమీద గుగ్గిలమైన గుత్తా జ్వాల!
ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించేందుకు సూరత్ కు వెళ్లిన భారత షటిల్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మీడియా వేసిన ఓ ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయింది. గతంలో ఆమెకు భారత జట్టు క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తో అఫైర్ ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై ఆమెను ప్రశ్నించగా, ఆమె మండిపడింది. "అదంతా ఓ రూమర్. మీరంతా పదే పదే అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? గతంలో ఎన్నోసార్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను కదా? వదిలిపెట్టరా?" అంటూ అంతెత్తున ఎగిరారు. కాగా, త్వరలో విడుదల కానున్న అజారుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం 'అజర్'లో జ్వాల పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం.