: ఈ రంగు దుస్తులంటే అమ్మాయిలకు ఎక్కువ ఇష్టమట!


పింక్ కలర్ దుస్తులను ధరించేందుకు ఎక్కువ శాతం మంది అమ్మాయిలు ఇష్టపడతారట. ఈ విషయాన్ని ఒక ఆన్ లైన్ క్లాత్ సెల్లింగ్ వెబ్ సైట్ వెల్లడించింది. అమ్మాయిల్లో ఎక్కువ మంది పింక్ రంగు దుస్తులనే తమ వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేస్తుంటారని చెప్పింది. ఈ మేరకు తమ సంస్థ ఒక సర్వే చేసిందని పేర్కొంది. అంతేకాకుండా, పింక్ కలర్ దుస్తులు ధరించిన అమ్మాయిలను అబ్బాయిలు కూడా ఎక్కువగా ఇష్టపడతారట. పింక్ కలర్ తర్వాత పసుపు, ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల డ్రెస్సులను ధరించేందుకు అమ్మాయిలు ఇష్టపడతారట. అయితే, అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడే బ్లూ కలర్ ను అమ్మాయిలు తక్కువగా ఇష్టపడతారన్నది కొసమెరుపు.

  • Loading...

More Telugu News