: మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తున్నా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోన్న ‘భాగీ’


టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్, సుధీర్ బాబు, సునీల్ గ్రోవర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా హిందీలో తెర‌కెక్కిన ‘భాగీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నా విడుదలైన తొలి పదిరోజుల్లోనే 70కోట్ల రూపాయల వసూళ్లను దాటేసిన ‘భాగీ’ ఇప్పుడు రూ.75 కోట్ల క్ల‌బ్‌లో అడుగు పెట్టేందుకు చేరువైంది. మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తున్నా భాగీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తుండ‌డంతో చిత్ర యూనిట్ ఆనందం వ్య‌క్తం చేస్తోంది. ఇండోనేషియన్ యాక్షన్ మూవీ 'ది రెయిడ్-రిడెంప్షన్', తెలుగు హిట్ సినిమా 'వర్షం' నుంచి యాక్షన్ సీక్వెన్స్ లను రిఫరెన్స్ పాయింట్లుగా తీసుకొని ‘భాగీ’ సినిమా రూపొందింద‌ని.. సినిమా విడుద‌ల అనంత‌రం విశ్లేష‌కులు తెలిపిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News