: జంప్ కు బ్రేకులు... వరుసగా రెండో రోజూ తగ్గిన బంగారం, వెండి ధర!


గత రెండు నెలల వ్యవధిలో దాదాపు రూ. 3 వేల వరకు పెరిగిన బంగారం ధర, అక్షయ తృతీయ పుణ్యమాని దిగివచ్చింది. బంగారం కొనుగోలుకు అత్యంత పర్వదినంగా భావించే అక్షయ తృతీయ అమ్మకాలు అంతంతమాత్రంగా సాగడం, వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో, ధరలను నిన్నటివరకూ పట్టి నిలిపిన ట్రేడర్లు, జ్యూయెలర్స్ ఒక్కసారిగా విక్రయాలకు దిగారని నిపుణులు అంచనా వేశారు. దీంతో మొన్నటి వరకూ రూ. 30 వేలకు పైగా ఉన్న ధర దిగజారింది. మంగళవారం నాటి బులియన్ సెషన్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 250 పడిపోయి రూ. 29,850కి చేరగా, వెండి ధర కిలోకు ఏకంగా రూ. 600 పడిపోయి రూ. 40,600కు చేరింది. జూన్ 3 నాటి బంగారం ఫ్యూచర్స్ ధర 0. శాతం తగ్గి రూ. 29,780కి చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే, 1.89 శాతం తగ్గి 1,263 డాలర్లకు చేరుకుంది.

  • Loading...

More Telugu News