: కొనసాగాలంటే పూణె నేడు నిలబడాల్సిందే.. నేడు విశాఖలో సన్ రైజర్స్ తో తలపడనున్న ధోనీ సేన
విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, పూణె సూపర్‌జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ధోనీ సారథ్యంలోని పూణె జట్టు నేడు హైదరాబాద్‌తో తప్పక నెగ్గాల్సి ఉంది. ఐపీఎల్9 లో ఇప్పటికి 10 మ్యాచులు ఆడిన పూణె కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో వెనకబడి పోయింది. నేటి మ్యాచ్‌లో ఓటమి పాలయితే ఇక ఆ జట్టు తదుపరి తలపడనున్న మ్యాచుల్లో విజయం సాధించినా ఫలితం ఉండదు. మరో వైపు అద్భుత ఆటతీరు కనబరుస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బలంగా కనబడుతోంది. సన్ రైజర్స్ తో ధోనీ సేన తలబడి నిలబడాలంటే చెమటోడ్చక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఈరోజు రాత్రి 8 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, పూణె సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. విశాఖ ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ నేపథ్యంలో అక్కడి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.