: రాణించిన డివిలియర్స్, రాహుల్, సచిన్...పంజాబ్ లక్ష్యం 176


ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా మొహాలీ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 175 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టుకు ఓపెనర్ కేఎల్ రాహుల్ (42), కెప్టెన్ విరాట్ కోహ్లీ (20) శుభారంభం ఇచ్చారు. కోహ్లీ త్వరగా పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన షేన్ వాట్సన్ (1) విఫలమయ్యాడు. దీంతో బెంగళూరు ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. డివిలియర్స్ (64) పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డప్పపటికీ కోహ్లీ, వాట్సన్ విఫలమవడంతో ఫలితం కనబడలేదు. చివర్లో సచిన్ బేబి (33), హెడ్ (11) అండతో ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో కరియప్ప, సందీప్ శర్మ చెరి రెండు వికెట్లు తీసి రాణించగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. 176 పరుగుల విజయలక్ష్యంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News