: వెట్టోరీ అయితే బెటరంటున్న కోహ్లీ!


భారత క్రికెట్ జట్టుకు తదుపరి కోచ్ గా, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డానియల్ వెట్టోరీ అయితే బాగుంటుందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ కు కోచ్ గా వెట్టోరీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో వెట్టోరీ పనితీరును దగ్గర నుంచి చూసిన కోహ్లీ, జట్టు కోచ్ పదవికి సిఫార్సు చేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 2014లో ధోనీ టెస్టు క్రికెట్ కు పదవీ విరమణ ప్రకటించిన తరువాత కోహ్లీ టెస్టు జట్టు కెప్టెన్ గా అవతరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు నుంచే వెట్టోరీతో కోహ్లీకి మంచి పరిచయం ఉంది. జూన్ నుంచి మార్చి 2017లోపు భారత్ 18 టెస్టు మ్యాచ్ లను ఆడాల్సి వుండటంతో, ఏ క్షణమైనా భారత కోచ్ ని నియమిస్తారని తెలుస్తోంది. అయితే, కోహ్లీ సిఫార్సు చేసిన వెట్టోరీ విషయంలో బీసీసీఐ ఎంత సీరియస్ గా ఉందన్న సంగతి తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News