: కోహ్లీ ఓ మెషీన్ లా బ్యాటింగ్ చేస్తాడు: జెంపా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మెషీన్ లా బ్యాటింగ్ చేస్తాడని ఆ జట్టు (ఆస్ట్రేలియా) ఆటగాడు ఆడం జెంపా తెలిపాడు. పూణేపై విజయం సాధించడంపై జెంపా మాట్లాడుతూ, అందర్లా కోహ్లీ వస్తూనే బౌలర్లపై విరుచుకుపడడని అన్నాడు. తొలుత పిచ్, బంతులను అర్థం చేసుకుంటాడని తెలిపాడు. కుదురుకునేందుకు కొన్ని బంతులను తీసుకుంటాడని, ఆ తరువాత పరుగుల యంత్రంలా పరుగులు చేసుకుంటూ పోతాడని, అలుపు సొలుపు ఉండదని జెంపా తెలిపాడు. పూణేపై విజయాన్ని సాధించి పెట్టిన ఇన్నింగ్స్ అద్భుతమని జెంపా ప్రశంసించాడు. రానున్న మ్యాచ్ లలో ఇదే జోరు కొనసాగిస్తామని జెంపా ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, ప్రతి మ్యాచ్ లో విజయం సాధిస్తే కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నాకౌట్ స్టేజ్ కు చేరే అవకాశం లేదన్న సంగతి తెలిసిందే.