: రహానే, తివారీ దూకుడు... భారీ స్కోరు సాధించిన ధోనీ సేన


ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా బెంగళూరు వేదికగా జరుగుతున్న 35వ మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ కు ఓపెనర్ రహానే శుభారంభం ఇచ్చాడు. సాధికారికమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. గతితప్పిన బంతులను శిక్షిస్తూ అర్ధసెంచరీ సాధించాడు. ఒపెనర్ ఖ్వాజా (16) రనౌట్ కావడంతో ఆదిలోనే వికెట్ కోల్పోయిన పూణేకు రహానే (74), సౌరబ్ తివారీ (52) ఆదుకున్నారు. అనంతరం ధోనీ (9), పెరీరా (14), జార్జ్ బెయిలీ (0) నిరాశపరిచారు. భాటియా (9), అశ్విన్ (10) చివర్లో సింగిల్స్ తీయడంతో రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు తీసింది. బెంగళూరు బౌలర్లలో షేన్ వాట్సన్ 3 వికెట్లతో ఆకట్టుకోగా, జోర్డన్, చాహల్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 192 పరుగుల విజయ లక్ష్యంతో కోహ్లీ సేన బ్యాటింగ్ ప్రారంభించనుంది. కాగా, టోర్నీలో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో భారీ బ్యాటింగ్ వనరులు కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడితే కనుక టోర్నీలో నాకౌట్ రౌండ్ కు ముందే నిష్క్రమించిన జట్టుగా నిలుస్తుంది.

  • Loading...

More Telugu News