: ఫేస్ బుక్ వాడొద్దు, జీన్స్ వేయొద్దు, భర్త లేకుండా బయటకు రావద్దు: బ్రిటన్ ముస్లిం మతాధికారులు


బ్రిటన్ లోని మస్లిం మతాధికారులు మహిళలకు పలు నిబంధనలు విధిస్తూ ఫత్వా జారీ చేశారు. వీటిని ముస్లిం మత సంఘాలు, మత పెద్దలు, మసీదులు ఆమోదించాయి. ఈ నిబంధనల వివరాల్లోకి వెళ్తే...ఫేస్ బుక్ వాడడం పాపం, దాని వల్ల చాలా మంది ముస్లిం మహిళలు బలవుతున్నారు. అదీ కాక ఫేస్ బుక్ పాపానికి ద్వారం లాంటిదని, అందుకే ఫేస్ బుక్ వాడవద్దని పేర్కొన్నారు. ముస్లిం మహిళలెవరూ ఫేస్ బుక్ అకౌంట్లు తెరవవద్దని, ఒక వేళ ఇప్పటికే తెరిచి ఉన్నా వాటిని తక్షణం మూసేయాలని సూచించారు. అలాగే జీన్స్ ప్యాంట్లు ధరించడం నేరమన్నారు. బయట అయినా, ఇంట్లో అయినా ప్యాంట్లు ధరించవద్దని స్పష్టం చేశారు. భర్త అనుమతి లేకుండా ఇంటి బయటకు రావద్దు, భర్త తోడు లేకుండా అసలే బయటకు రావద్దని ఈ నిబంధనల్లో పేర్కొన్నారు. భర్త అనుమతి లేకుండా ఏ పనీ చేయవద్దని లండన్ లోని ఇస్లామిక్ సెంటర్, క్రొయ్ డాయ్ మసీదు, సెంట్రల్ మసీదు ఆఫ్ బ్లాక్ బర్న్ కలిసి నిబంధనలు రూపొందించాయి.

  • Loading...

More Telugu News