: బుల్లి కొండచిలువను దొంగిలించిన కస్టమర్... చుక్కలు చూపించిన యజమాని
అమెరికాలోని ఫ్లోరిడా లోని జంతువులను విక్రయించే ఒక పెట్ స్టోర్ నుంచి బుల్లి కొండచిలువను దొంగిలించిన వ్యక్తికి షాపు యజమాని చుక్కలు చూపించాడు. ట్రావిస్ ట్రెడర్ అనే వ్యక్తి యానిమల్ హౌస్ పెట్ సెంటర్ కు వెళ్లాడు. అక్కడ ఉన్న జంతువులను చూస్తున్నట్లే నటించిన ట్రావిస్, ఒక చిన్న కొండచిలువను తీసి తన జేబులో పెట్టుకుని ఏమీ ఎరుగనట్లుగా నటించాడు. అయితే, ఇదంతా సీసీటీవీలో గమనిస్తున్న షాపు యజమాని ట్రావిస్ వద్దకు వచ్చి, ఏం తీశావని అడిగాడు. తానేమీ తీయలేదని అతను సమాధానమిచ్చాడు. యజమాని దబాయించి అడగటంతో అసలు విషయం బయటపడింది. అతని జేబులో కొండ చిలువ ఉన్న విషయం తెలిసింది. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ట్రావిస్ ను షాపు యజమానితో పాటు అక్కడి ఉద్యోగులు కలిసి అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పంపారు.