: యూట్యూబ్‌లో రజనీ ‘కబాలీ’కి కోటి దాటేసిన హిట్లు.. ఆల్ టైమ్ రికార్డ్..!
పా.రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న‘కబాలీ’ చిత్రం టీజర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో కబాలీ టీజర్‌ను అభిమానులు తెగ చూసేస్తున్నారు. కేవలం మూడు రోజుల్లోనే పది మిలియన్లకు (కోటి) పైగా హిట్లు వచ్చిపడ్డాయి. కబాలీ టీజర్‌కి యూట్యూబ్ లో వచ్చిన స్పందన భారతీయ సినిమాల టీజర్ల విషయంలో ఆల్ టైమ్ రికార్డేనని విశ్లేషకులు అంటున్నారు. ఆయన ఇందులో డైలాగ్స్, స్టైల్, త్రీ పీస్ సూట్ అదిరిపోయాయి.