: హమ్మయ్య! నా కష్టాలు తీరిపోయాయి...భారత్ కు వస్తున్నా: సినీ నటి విద్యుల్లేఖ రామన్


'రామయ్యా వస్తావయ్యా', 'రాజుగారి గది', 'సరైనోడు' సినిమాల్లో నటించి హాస్యనటిగా పేరుతెచ్చుకున్న తమిళ సినీనటి విద్యుల్లేఖ రామన్ స్నేహితులతో కలిసి వియన్నాకు విహార యాత్రకు వెళ్లింది. అక్కడ ఓ హోటల్ లాబీలో ఉండగా అడ్రస్ అడిగే నెపంతో ఆమె హ్యాండ్ బేగ్ ను దొంగలు తస్కరించారు. ఇందులో ఆమె పాస్ పోర్ట్, నగదు, ఇతర పత్రాలు ఉన్నాయి. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందుల్లో పడింది. వెంటనే ట్విట్టర్ ద్వారా విదేశాంగ శాఖామంత్రి సుష్మాస్వరాజ్, పీఎంవోకు తనను ఆదుకోవాలంటూ ట్వీట్ చేసింది. దీంతో వియన్నాలోని భారత రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. వెంటనే జరిగిన పరిణామాల అనంతరం ఆమె మళ్లీ ట్వీట్ చేసింది. వియన్నాలోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఎంతో సాయం చేశారని తెలిపింది. ఈ కష్టంలో సాయం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. తనను అర్థం చేసుకుని, తనకు ట్రావెల్ పర్మిట్ వీసా ఏర్పాటు చేశారని, ఈ రోజే భారత్ కు బయల్దేరుతున్నానని ఆమె పేర్కొంది. విదేశాలకు వచ్చేవారిని లక్ష్యం చేసుకుని దాడులు జరుగుతుంటాయని, జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించింది.

  • Loading...

More Telugu News