: ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గాయ్.. వర్షాలు పడే సూచనలు: వాతావరణ కేంద్రం
రెండు రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అనంతరం అక్కడి వాతావరణం కాస్త చల్లబడింది. గత నెల ఆరంభం నుంచి భానుడి భగభగలను మాత్రమే చూస్తోన్న ప్రజలు ఇప్పుడు ఈదురు గాలులతో కూడిన జల్లుల్ని చూస్తున్నారు. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. అనంతపురం, కడప, తిరుపతి మినహా వేరే జిల్లాల్లో ఉష్ణోగ్రత 40డిగ్రీలకు దాటలేదు. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.