: మిషన్ కాకతీయ పనుల్లో అపశృతి... ఫిట్స్ తో డ్రైవర్ మృతి


మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. చెరువు నుంచి మట్టిని తరలిస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో నిన్న జరిగింది. పూడిక తీసిన మట్టిని ట్రాక్టర్ డ్రైవర్ పి.రవి (23) రైతుల పొలాలకు తరలిస్తున్నాడు. చెరువు కట్టపై నుంచి ట్రాక్టర్ వెళ్తున్న సమయంలో రవికి ఫిట్స్ రావడంతో, దానిపై నుంచి కిందపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనపై ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News