: ముందు నువ్వు పెళ్లిచేసుకో బాబూ!: బీజేపీ ఎంపీకి అజాంఖాన్ సలహా
బీజేపీ ఎంపీలు యోగి ఆదిత్యానాధ్, సాక్షిమహారాజ్ లపై సమాజ్ వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి అజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింల జనాభా పెరుగుతోంది, హిందువుల జనాభా కూడా పెరగాల్సిన అవసరం ఉంది, ప్రతి హిందూమాత నలుగురు బిడ్డలకు జన్మనిచ్చి, ఇద్దరిని దేవాలయానికి అంకితం ఇవ్వాలంటూ గతంలో ఆదిత్యానాధ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని ముందు ఆయన వివాహం చేసుకోవాలని సూచించారు. ఇతరులపై విమర్శలు, ఇతరులకు సూచనలు మాని ఆయన మగాడిగా నిరూపించుకోవాలని ఆయన సవాలు విసిరారు. అలా నిరూపించుకుంటే ఆయన తరం పెరుగుతుందని అన్నారు. ఇందుకుకోసం ముందుగా ఆయన వివాహం చేసుకోవాలని సూచించారు. అలాగే గతంలో తలాక్ పై వ్యాఖ్యానించిన సాక్షి మహారాజ్ పై విమర్శలు గుప్పిస్తూ, ఒక యువతిని రేప్ చేసిన వ్యక్తా విమర్శలు చేసేది? అని మండిపడ్డారు. రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాక్షి మహారాజ్ పై ఏం మాట్లాడుతానని ఆయన అన్నారు.