: జూన్ 11 నుంచి జింబాబ్వేతో తలపడనున్న టీమిండియా... షెడ్యూల్ ఖరారు
టీమిండియా జింబాబ్వే పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల 11 నుంచి జింబాబ్వేతో భారత క్రికెట్ టీమ్ తలపడనుంది. జింబాబ్వే, భారత్ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. వచ్చేనెల 11, 13, 15 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం 18, 20, 22 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా జరిగే ఈ మ్యాచ్‌లన్నీ అక్కడి హరారే స్పోర్ట్ క్లబ్ స్టేడియంలోనే జరగనున్నాయి.