: స్వీడన్ లో చిత్రమైన ఆచారం...వధూవరులు అందుకే విడిచి ఉండరు!
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జాతుల ప్రజల మధ్య చిత్రమైన ఆచారాలున్నాయి. స్వీడన్ లో ఓ ఆచారాన్ని గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుఫుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... స్వీడన్ లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలోని వ్యక్తులు ఒంటరిగా కనిపిస్తే ఇతరులు వచ్చి వారికి ముద్దులు పెడతారు. వరుడు ఒంటరిగా దొరికినా ఇదే తంతు, ఇక వధువు ఒంటరిగా దొరికినా ముద్దుల్లో మునిగిపోవాల్సిందే. ఇది కేవలం పెళ్లి రోజుకే పరిమితం. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు తమ ఎదురుగా ఇతరులు ముద్దు పెట్టుకుంటే అంగీకరించరు. దీంతో వారు ఒకరిని విడిచి ఒకరు ఉండరని, ఆ రోజు కనీసం బాత్రూంకి వెళ్లాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారని అక్కడి వారు చెబుతున్నారు. ఇలా ముద్దులు పెట్టేటప్పుడు వద్దు అని అనకూడదు...మౌనంగా వారితో ముద్దులు పెట్టించుకోవాల్సిందేనట. సంప్రదాయం అంటే ఇదే మరి.