: సెరెనా విలియమ్స్ ఫోటోపై సోషల్ మీడియాలో మండిపడుతున్న అభిమానులు
సెరెనా విలియమ్స్... ప్రపంచ టెన్నిస్ తో ఏమాత్రం పరిచయం ఉన్న వారికైనా తెలిసే పేరు. అమెరికా నల్లకలువగా పేరొందిన సెరెనా విలియమ్స్ కు నిత్యనూతనంగా కనిపించడం అంటే ఇష్టం. దీంతో ఆమె అప్పుడప్పుడు ఫోటో షూట్ లు, ర్యాంప్ షోలలో కూడా కనువిందు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పీపుల్స్ మ్యాగజీన్ పత్రిక 'మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ 2016' శీర్షికన ఓ కథనం ప్రసారం చేసింది. ఈ కథనానికి సెరెనా విలియమ్స్ స్విమ్ సూట్ ధరించిన ఫోటోను ప్రచురించింది. ఈ ఫోటోను తన ఇన్ స్టా గ్రాంలో సెరెనా పోస్టు చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్లో గణనీయమైన ఫాలోయర్లను కలిగి ఉన్న సెరెనా ఫోటో పోస్టు చేసిన క్షణాల్లో అందరికీ చేరిపోయింది. అంతే, ఈ ఫోటోపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఫోటోలో సెరెనా నడుము భాగం నాజూగ్గా కనిపించడం వారికి ఆగ్రహం తెప్పించింది. ఆమె అసలు ఫిజిక్ అభిమానులకు తెలుసు కాబట్టి, ఇలా ఫోటోషాప్ లో మార్పులు చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ పలువురు ప్రశ్నించారు. మరికొందరు ఆ ఫోటోను తక్షణం తీసేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అభిమానుల ఆగ్రహం తట్టుకోలేకపోయిన సెరెనా ఆ ఫోటోను తీసేసి, తన ఒరిజనల్ స్విమ్ సూట్ ఫోటోను పోస్టు చేసింది.