: 100 రోజుల్లో 5 లక్షల ఫోన్లు అమ్మేసిన లెనోవో


అపరిమితమైన భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తమ అవకాశాలను పెంచుకునేందుకు పోటీ పడుతున్న చైనా కంపెనీల్లో లెనొవో ముందు నిలిచింది. జనవరి 19న ఈ సంస్థ వైబ్ కే4 నోట్ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయగా, మూడు నెలల వ్యవధిలో 5 లక్షలకు పైగా ఫోన్లను విక్రయించామని సంస్థ ప్రకటించింది. తొలుత రిజిస్ట్రేషన్ల ద్వారా విక్రయాలు చేపట్టగా 1.8 లక్షల యూనిట్లు అమ్ముడైనాయని, ఆపై అన్ని స్టోర్ల ద్వారా అమ్మకాలు ప్రారంభించగా, 3 లక్షలకు పైగా ఫోన్లు అమ్ముడైనాయని తెలిపింది. ఈ ఫోన్ లోని థియేటర్ మ్యాక్ అనే ఫీచర్ కారణంగానే ఫోన్ కు ఆదరణ అధికంగా ఉందని సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News