: నా గురించి చాలా బాగా చెప్పావు నాన్నా, థ్యాంక్స్: శ్రుతిహాసన్
కమల్ నటిస్తున్న కొత్త చిత్రం ‘శభాష్ నాయుడు’లో ప్రముఖ దక్షిణాది హీరోయిన్, ఆయన కుమార్తె అయిన శ్రుతిహాసన్ కూడా నటించనుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈరోజు చెన్నైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి శ్రుతిహాసన్ కూడా హాజరైంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. అంతే కాకుండా, తన గురించి చాలా చక్కగా తన తండ్రి మాట్లాడారని, ఈ చిత్రంలో తనకు నటించే అవకాశం కల్పించినందుకు కృతఙ్ఞతలు అంటూ ఆ ట్వీట్ లో పేర్కొంది. ఈ సందర్భంగా కమల్ తో దిగిన ఒక ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది.