: 90వ ఏట 'స్నేహితుడి'తో రెండో పెళ్లికి రెడీ అవుతున్న మాజీ సెనేటర్!


అమెరికాలోని పెన్సిల్వేనియా మాజీ సెనేటర్‌ హారిస్‌ వొఫోర్డ్ వ‌య‌సు 90 ఏళ్లు. 20 ఏళ్ల క్రితం భార్య‌ను కోల్పోయిన ఆయ‌న ఇప్పుడు మ‌రో పెళ్లి చేసుకోబోతున్నాడు. అదీ ఒక పురుషుడిని కావడం ఇక్కడ పెద్ద విశేషం! త‌న భార్య చ‌నిపోవ‌డంతో 20 ఏళ్లుగా ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతోన్న హారిస్‌ వొఫోర్డ్ త‌న భార్య మ‌ర‌ణాంత‌రం.. ఫ్లోరిడాలో మాథ్యూ కార్ల్‌టన్‌ అనే యువకుడిని క‌లిశాడు. మాథ్యూ కార్ల్‌టన్‌తో 15 ఏళ్లుగా స్నేహాన్ని కొన‌సాగిస్తోన్న హారిస్‌ వొఫోర్డ్ ఇప్పుడు అతనిని వివాహ‌మాడ‌నున్నాడు. త‌న భార్య త‌రువాత‌ త‌న‌ను ప్రేమించే వ్య‌క్తిగా మాథ్యూ(40)ను చూస్తున్నానని చెప్పాడు. స‌మాజం ఈ విష‌యంపై ఏమ‌నుకున్నా స‌రే మాథ్యూను పెళ్లి చేసుకుంటాన‌ని సంతోషంగా చెబుతున్నాడు ఈ తొంభై ఏళ్ల పెళ్లికొడుకు!

  • Loading...

More Telugu News