: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ముహూర్తం నిర్ణయం


మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానుల ఆశ నెరవేరనుంది. ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చిత్రం ప్రారంభోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 30వ తేదీ తర్వాత ముహూర్తాలు లేకపోవడంతో ఈ ముహూర్తాన్నే నిర్ణయించారు. జూన్ చివరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. తమిళ చిత్రం ‘కత్తి’ కథను రీమేక్ చేయడానికి దర్శకుడు వివి వినాయక్ రంగంలోకి దిగనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా మెగాస్టార్ తనయుడు, ప్రముఖ హీరో రాంచరణ్ వ్యవహరించనున్నారు.

  • Loading...

More Telugu News