: బ్రహ్మాజీకి కేక్ తినిపించిన జూనియర్ ఎన్టీఆర్.. ‘జనతా గ్యారేజ్’ సెట్‌లో బ్రహ్మాజీ బర్త్‌డే వేడుక
విభిన్న పాత్రలను పోషిస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ ఈరోజు తన 51వ పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తోన్న బ్రహ్మాజీ చిత్ర బృందం సెట్లో ఏర్పాటు చేసిన బర్త్ డే కేక్ ను కట్ చేయగా.. జూనియర్ ఎన్టీఆర్ కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ విషయాన్ని బ్రహ్మాజీ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించాడు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా బృందం అంతా బ్రహ్మాజీ పుట్టిన రోజు వేడుకలో పాల్గొని, ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపింది.