: గేల్ ఏం మాట్లాడితే మాకెందుకంటున్న క్రికెట్ ఆస్ట్రేలియా!
ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ పోటీల్లో క్రిస్ గేల్ ఆడేందుకు తమకు అభ్యంతరం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. మెల్ బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ఆడుతున్న గేల్, గత సీజనులో ఓ టెలివిజన్ యాంకర్ తో అసభ్యకరంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గేల్ పై తీవ్ర విమర్శలతో పాటు అతన్ని తొలగించాలన్న డిమాండ్ వస్తుండగా, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సుదర్ లాండ్ స్పందించారు. మ్యాచ్ ఫిక్సింగ్, డోపింగ్ వంటి వాటికి పాల్పడితే మాత్రమే తాము జోక్యం చేసుకుంటామని, ఆటగాళ్లను తప్పించడంలో తమ పాత్ర ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఎవరిని ఆడించాలన్న విషయంలో ఫ్రాంచైజీలదే తుది నిర్ణయమని వివరించారు.