: పాసైన ప్రత్యూషను ఫెయిలైనట్టు చూపిన ఇంటర్ బోర్డు!

ప్రత్యూష... తండ్రి, సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలు అనుభవించి, పునర్జన్మ పొందిన బాలిక. ప్రత్యూషకు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల వెల్లడైన ఇంటర్ పరీక్షల్లో ప్రత్యూష పాస్ మార్కులు పొందినప్పటికీ, ఫెయిల్ అయినట్టు చూపించిన ఇంటర్ బోర్డు మరోసారి మానసికంగా వేధించింది. వాస్తవానికి ప్రత్యూష సెయింట్ డేనియల్ కాలేజీ నుంచి మొదటి సంవత్సరం, నారాయణ కాలేజీ నుంచి రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. ఈమె ప్రాక్టికల్స్ మార్కులను పరిగణనలోకి తీసుకోకుండానే ఇంటర్ బోర్డు ఫెయిలైనట్టు ప్రకటించింది. ఈ ఉదంతం పత్రికల్లో రాగా, స్పందించిన అధికారులు నాలిక్కరుచుకున్నారు. మార్కుల గణనలో పొరపాటు జరిగిందని, ఆమె పాసైందని, పాస్ మెమోను ఇస్తున్నామని అధికారులు తెలిపారు.

More Telugu News