: జయలలిత సమక్షంలో అన్నాడీఎంకేలో చేరిన సినీ నటి నమిత

తెలుగు, తమిళంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో భారీ అందాల సినీ నటి నమిత రాజకీయాల్లో అడుగుపెట్టింది. తిరుచ్చిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జయలలిత సమక్షంలో ఆమె ఈ రోజు అన్నాడీఎంకే కండువా కప్పుకుంది. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉందని, తనను అన్నాడీఎంకేలో చేర్చుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి జయలలితకు నమిత గతంలో లేఖ రాసింది. దీంతో ఆమెను జయలలిత పార్టీలో చేర్చుకున్నారు. అన్నా డీఎంకే తరపున ప్రచారం చేసేందుకు ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారని, ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా తమిళనాట నమితకు భారీ సంఖ్యలో అభిమానులున్నారు. గతంలో ఆమెకు ఒక గుడిని కూడా కట్టిన సంగతి తెలిసిందే. గుజరాత్ కు చెందిన నమిత సినీ రంగంలో తనను ఆదరించిన తమిళనాడు నుంచి పోటీ చేయాలని భావించడం ఆసక్తికరమే. కాగా, నమిత తెలుగు సినిమా 'సొంతం'తో సినీరంగ ప్రవేశం చేసింది.

More Telugu News