: సైకిలెక్కేసిన చాంద్ బాషా... 13కు చేరిన జంపింగ్ ఎమ్మెల్యేల సంఖ్య
వైసీసీ నేత, అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా సైకిలెక్కేశారు. పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి విజయవాడకు వచ్చిన చాంద్ బాషా... కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో సొంత గూటికి చేరారు. నిన్న రాత్రే కదిరి నుంచి బయలుదేరిన చాంద్ బాషా... నేటి ఉదయం నేరుగా చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించుకున్నాక... చంద్రబాబు నివాసం వద్దే ఆయన టీడీపీలో చేరిపోయారు. చాంద్ బాషా చేరికతో ఇప్పటిదాకా వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 13కు చేరింది.