: చంద్రబాబుతో చాంద్ బాషా భేటీ!... భారీ అనుచరగణంతో వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ నేత, అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. నిన్న రాత్రే తన సొంతూరు కదిరి నుంచి భారీ సంఖ్యలో అనుచరగణంతో బయలుదేరిన చాంద్ బాషా నేటి ఉదయానికే విజయవాడ చేరుకున్నారు. పార్టీ మారేందుకే నిర్ణయించుకున్న చాంద్ బాషా... వైసీపీ ముఖ్యనేతల బుజ్జగింపులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. గతంలో టీడీపీ నేతగానే ఉన్న ఆయన తన సొంత గూటికే చేరేందుకు విజయవాడ వచ్చారు. మరికాసేపట్లో ఆయన అధికారికంగా టీడీపీలో చేరే అవకాశముంది.

More Telugu News