: తిరుపతిలో ఈదురు గాలులు...ఇల్లెందులో భారీ వర్షం

చిత్తూరు జిల్లా తిరుపతిలో భారీగా ఈదురు గాలులు వీచాయి. కపిల తీర్థం రహదారి, వరదరాజనగర్ లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ తీగలపై చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. మణుగూరు మండలం పగిడేరులో పిడుగుపాటుకు ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు.

More Telugu News