: 'నేను బ్లాక్ బ్రాడ్ పిట్ ను... పురుష వ్యభిచారిని' అని ప్రకటించుకున్న విండీస్ క్రికెటర్
వ్యభిచారం గుట్టుగా చేసుకుంటారు. ప్రధానంగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు మహిళలకు, వివాదాలకు దూరంగా మసలుతారు. తాజాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ టినో బెస్ట్ తానో పురుష వ్యభిచారినని ప్రకటించాడు. ఇంత వరకు వివిధ దేశాలకు చెందిన 650 మంది యువతులతో జీవితాన్ని అనుభవించానని పేర్కొన్నాడు. తన తొలి ప్రియురాలు మొలిసా ద్వారా ఓ కూతుర్ని కన్నానని చెప్పిన టినో బెస్ట్ ఆ తరువాత ఆమె తనను పట్టించుకోవడం మానేసిందని అన్నాడు. అప్పటి నుంచి తాను ప్లేబోయ్ గా మారానని వెల్లడించాడు. 2004లో వెస్టిండీస్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన టినో బెస్ట్...25 టెస్టులు, 26 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. వన్డే, టెస్టుల్లో 91 వికెట్లు కొట్టడం విశేషం. 2012లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో 11వ నెంబర్ బ్యాట్స్ మన్ గా దిగిన బెస్ట్ చేసిన 95 పరుగులు ప్రపంచ రికార్డు. 2005లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన బెస్ట్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ...ఆ మూడు నెలల కాలంలో సుమారు 40 మంది యువతులతో గడిపానని తెలిపాడు. తమ జట్టులో ఆ సిరీస్ లో ఎక్కువ మంది యువతులతో గడిపిన వ్యక్తి తానేనని తెలిపాడు. గేల్ కు ఇలాంటివి పడవని చెప్పిన బెస్ట్...డ్వెన్ బ్రావోతో బాగా సరదాగా సాగిపోతుందని చెప్పాడు. తాను అమ్మాయిలను ఇష్టపడతానని...వారు తనను ఇష్టపడతారని పేర్కొన్న బెస్ట్, తనను తాను బ్లాక్ బ్రాడ్ పిట్ గా అభివర్ణించుకున్నాడు.