: కూతురుకి ఆసక్తికరమైన పేరు పెట్టిన విండీస్ క్రికెటర్ గేల్
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ తండ్రి అయిన సంగతి తెలిసిందే. కుమార్తె పుట్టిందని తెలియగానే బెంగళూరు నుంచి విండీస్ కు గేల్ పయనమయ్యాడు. తనకు దేవుడు ఎంతో విలువైన బహుమతి ఇచ్చాడని గేల్ ట్వీట్ చేశాడు. ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభవాన్ని కోరుకుంటారని గేల్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. కుమార్తె పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా తన కుమార్తెకు 'బ్లష్' అని పేరు పెడుతున్నట్టు ప్రకటించాడు. ఇంగ్లిష్ లో 'బ్లష్' అంటే సిగ్గు పడడం, సిగ్గుతో బుగ్గలు ఎర్రబడడం అని అర్థం. గేల్ ఈ పేరు ప్రకటించడంపై విండీస్ మీడియా ఆసక్తికర కథనం ప్రచురించింది. బార్ గర్ల్ వివాదం, జర్నలిస్టుతో అసభ్య వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్న గేల్ సిగ్గుపడి ఉంటాడని అందుకే ఈ పేరు ఎంచుకున్నాడని పేర్కొంది.