: అయిష్టంగానే సినిమాల్లో నటిస్తుంటాను: సినీ నటుడు అరవిందస్వామి


నటుడిని కావాలని ఎప్పుడూ అనుకోలేదని, సినిమాల్లో అయిష్టంగానే నటిస్తుంటానని.. అయితే ఆ చిత్రాలు విజయవంతమైతే సంతోషిస్తానని సినీ నటుడు అరవిందస్వామి అన్నారు. రోజా, బొంబాయి వంటి చిత్రాలతో జాతీయస్థాయిలో నటుడిగా గుర్తింపు దక్కించుకున్న ఆయన పలు విషయాలపై మాట్లాడారు. సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ నటుడిగా నిరూపించుకోవాలని, స్టార్ హోదాను ఎంజాయ్ చేయాలని చూస్తుంటారని.. అందుకోసం, శ్రమిస్తుంటారని అన్నారు. అయితే, అవన్నీ తనకు నచ్చవని, సింపుల్ గా ఉండేందుకే తాను ఇష్టపడతానని చెప్పారు. సినిమాలలో నటించడం ద్వారా వచ్చిన సెలబ్రిటీ హోదా తనకు అసౌకర్యంగా అనిపిస్తుందని అరవింద స్వామి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News