: పుదుచ్చేరి ఎన్ఐటీలో విద్యార్థుల ఆందోళన.. తరగతులకు హాజరు కాబోమని స్పష్టం
తమ సమస్యలపై గళం విప్పుతూ తరగతులు బహిష్కరిస్తోన్న విద్యార్థుల ఆందోళనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా తెలుగు విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్న పుదుచ్చేరి ఎన్ఐటీలో కనీస సదుపాయాల్లేవంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. పుదుచ్చేరి ఎన్ఐటీ మెయిన్ గేట్ వద్ద ధర్నాకు దిగారు. తమ సమస్యలపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తరగతులకు హాజరయ్యే ప్రసక్తే లేదని చెబుతున్నారు.