: రాజకుటుంబానికి ఈ ఫోటో అపురూపం...నాలుగు తరాలున్నాయి


బ్రిటన్ రాజకుటుంబం అపురూపమైన ఫోటోను తీయించుకుంది. క్వీన్ ఎలిజబెత్-2 90వ జన్మదిన వేడుకలు రేపు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని బ్రిటన్ ఓ స్టాంపును విడుదల చేయనుంది. ఇంత ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని క్వీన్ ఎలిజబెత్-2 తన వారసులతో ఫోటో దిగారు. కుమారుడు ఛార్లెస్, మనవడు విలియమ్, ముని మనవడు జార్జ్ లతో ఆమె ఫోటోలో కనువిందు చేశారు. రెండేళ్ల జార్జ్ కి ఇదే తొలి రాయల్ పోస్టల్ స్టాంపు కావడం విశేషం. రెనాల్డ్ మెక్ క్నీ అనే ఫోటో గ్రాఫర్ ఈ ఫోటోను తీశారు. కేవలం గ్రూప్ ఫోటోగానే కాకుండా వీరి విడివిడి ఫోటోలతో కూడిన స్టాంపులను కూడా విడుదల చేయనున్నారు. అదే సందర్భంగా క్వీన్ ఎలిజబెత్-2 జీవితంలో సంభవించిన విశేషాలతో ఏడు స్టాంపులను విడుదల చేయనుంది.

  • Loading...

More Telugu News