: 'గూగుల్ డాట్ కాం' ప్రమాదకరమే! ... స్వయంగా అంగీకరించిన గూగుల్
గూగుల్ డాట్ కాం... ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఒకరోజులో అత్యధికంగా తెరచి చూసే వెబ్ సైట్. ఈ వెబ్ సైట్ పై గూగుల్ సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వెబ్ సైట్ పాక్షికంగా ప్రమాదకరమేనని అంగీకరించింది. గూగుల్ సెర్చ్ టూల్ ను వాడుతున్న వేళ, కొన్ని వందల కోట్ల యూఆర్ఎల్ లను వెతికి సమాచారాన్ని అందించే సంస్థ ఒక్కోసారి రక్షణాత్మకం కాని వెబ్ సైట్ లనూ చూపుతోందని వెల్లడించింది. సెర్చ్ లో భాగంగా డిస్ ప్లే అయ్యే పేజీల్లో కొన్నిసార్లు వైరస్ లు వస్తున్నాయని, వాటిని ఓపెన్ చేస్తే, కంప్యూటర్లలోకి వైరస్ ఎక్కిపోతోందని, ఆపై కస్టమర్ల సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలిస్తున్నారని గూగుల్ డాట్ కామ్ వెల్లడించింది. కొన్నిసార్లు యూజర్లు చెడు కంటెంట్ ను వెబ్ సైట్లలో ఉంచుతున్నారని, వీటిని చూడటం వల్ల ఇతర కస్టమర్లకు కొంత అసౌకర్యం కలుగుతోందని పేర్కొంది. సమస్య తాత్కాలికమేనని, దీన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.