: మరో మూడు నెలల వరకు పీఎఫ్‌ విధానంలో మార్పుల్లేవ్: దత్తాత్రేయ

నూతన పీఎఫ్‌ విధానాన్ని నిరసిస్తూ బెంగళూరులో గార్మెంట్‌ కార్మికులు చేపట్టిన ఆందోళనతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. మరో మూడు నెలల వరకు పీఎఫ్‌ నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, కొత్త నిబంధన ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని స్ప‌ష్టం చేశారు. నూతన పీఎఫ్‌ నిబంధనతో తమకు అన్యాయం జరుగుతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై ఆగష్టు ఒకటి లోపు అన్ని వర్గాలతో చర్చిస్తామన్నారు. పీఎఫ్‌ కొత్త నిబంధనపై వారికి అవగాహన కల్పిస్తామన్నారు. బెంగళూరులో గార్మెంట్‌ కార్మికుల డిమాండ్లలో న్యాయం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

More Telugu News