: యూఎస్ మార్కెట్లోకి డాక్టర్ రెడ్డీస్ కొత్త ఇంజక్షన్


తీవ్రమైన మైగ్రేన్ తో బాధపడేవారికి చికిత్సను అందించే సరికొత్త ఇంజక్షన్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. తమ యూఎస్ సబ్ సైడరీ సంస్థ ప్రొమియస్ ఫార్మా ఎల్ఎల్సీ ద్వారా తాము తయారు చేసిన 'జంబ్రేస్ సిమ్టచ్' ఇంజక్షన్ ఔషధాన్ని వాణిజ్య పరంగా అందుబాటులో ఉంచినట్టు బీఎస్ఈకి వెలువరించిన ఫైలింగ్ లో డాక్టర్ రెడ్డీస్ తెలియజేసింది. యూఎస్ ఎఫ్డీయే నుంచి ఈ ఔషధానికి జనవరిలో అనుమతులువచ్చాయని, సింగిల్ డోస్ డిస్పోజబుల్ ఇంజెక్టర్ రూపంలో ఇది అన్ని మెడికల్ షాపుల్లో అందుబాటులో ఉంటుందని వివరించింది. న్యూరాలజీ పోర్ట్ ఫోలియోలో ఇది తమ తొలి బ్రాండెడ్ ఔషధమని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాఘవ్ చారి వెల్లడించారు. అకస్మాత్తుగా మైగ్రేన్ తో బాధపడేవారు మాత్ర తీసుకుని ఉపశమనం పొందడం ఆలస్యమవుతుందని, అటువంటి వారికి ఇంజక్షన్ ఉపయుక్తకరమని తెలిపారు.

  • Loading...

More Telugu News