: ధోనీ గురించి ఆ హీరో చాలా తెలుసుకున్నాడు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'ధోనీ-అన్ టోల్డ్ స్టోరీ'లో టైటిల్ రోల్ పోషిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీ గురించి చాలా తెలుసుకున్నాడు. ఈ సినిమాలో నటించమని అడిగిన తరువాత సుశాంత్, ధోనీ గురించి పెద్ద రీసెర్చ్ చేశాడట. టీమిండియాలోకి రాకముందు ధోనీ పని చేసిన ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ బస చేసేందుకు స్టార్ హోటల్ సౌకర్యం ఉన్నప్పటికీ ధోనీ బస చేసిన టీసీ రెస్ట్ హాల్ లో బస చేశాడు. ధోనీ సహోద్యోగులను కలిశాడు. టీసీల వ్యవహార శైలి ఎలా ఉంటుందో గమనించిన సుశాంత్, ధోనీ సహోద్యోగుల నుంచి ధోనీకి సంబంధించి ఎవరికీ తెలియని పలు విషయాలను తెలుసుకున్నాడు. ఇవన్నీ సినిమాలో చూపించే ప్రయత్నం చేశానని సుశాంత్ తెలిపాడు.