: దారిత‌ప్పిన చిరుత అక్క‌డికి వ‌చ్చి బావిలో ప‌డిపోయింది

దారిత‌ప్పి జ‌నావాసం వైపు వ‌స్తోన్న ఓ చిరుత బావిలో ప‌డిపోయింది. దాన్ని బ‌య‌ట‌కు తీయ‌డానికి అధికారులు సుమారు ఐదు గంట‌పాటు శ్ర‌మించారు. గుజ‌రాత్ జునాగ‌ఢ్‌లో ఈ దృశ్యం క‌నిపించింది. అక్క‌డికి ద‌గ్గ‌ర‌లోని ఫారెస్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన చిరుత జునాగ‌ఢ్‌లో సుమారు 70అడుగుల లోతున్న బావిలో ప‌డిపోయింది. విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానికులు అట‌వీశాఖ అధికారులకు స‌మాచారం ఇవ్వ‌డంతో చిరుత‌ను ర‌క్షించ‌డానికి వెంట‌నే రంగంలోకి దిగారు. ఓ బోనులో కోడిని ఎర‌గా వేసి, ఆ బోనుని బావిలోకి పంపించి చివ‌ర‌కు చిరుతను బ‌య‌ట‌కు తీశారు.

More Telugu News