: 116 ఏళ్ల వయసులో బ్యాంకు ఖాతా తెరిచిన నేతాజీ డ్రైవర్ కల్నల్ నిజాముద్దీన్

కల్నల్ నిజాముద్దీన్... భారత్ కు స్వాతంత్ర్యం తేవడమే లక్ష్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన వేళ, ఆయనకు నమ్మినబంటుగా, వాహనానికి డ్రైవరుగా సేవలందించి, ఇప్పటికీ జీవించే వున్న వ్యక్తి. ఉత్తరప్రదేశ్ లోని ఆజాంగఢ్ జిల్లాలోని ముబారక్ పూర్ లో 116 ఏళ్ల వయసులోనూ తన పనులు తాను చేసుకుంటూ జీవిస్తున్న నిజాముద్దీన్, తన భార్య అజ్బున్నీసా (107) తో కలసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయింట్ ఎకౌంటును తెరిచారు. ఈ సందర్భంగా తన వోటర్ ఐడీ కార్డును ఇవ్వగా, అందులో నిజాముద్దీన్ 1900లో పుట్టినట్టు ఉంది. దాని ప్రకారం నేటికి ఆయన వయసు 116 సంవత్సరాల 3 నెలల 15 రోజులు. కాగా, భూమిపై జీవిస్తున్న అత్యంత వయోవృద్ధుడు నిజాముద్దీనే. ఈ విషయం మాత్రం అధికారికంగా ధ్రువీకరించాల్సి వుంది. ఇటీవల జరిగిన ఓ సభలో కల్నల్ నిజాముద్దీన్ ను సన్మానించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం పొందారు.

More Telugu News