: జైలు నుంచి ఆసుపత్రికి ఛగన్ భుజభల్ తరలింపు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత ఛగన్ భుజబల్ ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఛగన్ భుజబల్ తీవ్రమైన గుండెనొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను పరీక్షించిన జైలు వైద్యులు, హుటాహుటీన ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో అతనిని సెయింట్ జార్జి ఆసుపత్రికి తరలించి, ఐసీయూలో చేర్చారు. పరీక్షలు నిర్వహిచిన వైద్యులు, తీవ్రమైన గుండెనొప్పి, రక్తపోటుతో ఆయన బాధపడుతున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యస్థితి నిలకడకు వచ్చిన తరువాత జేజే ఆసుపత్రికి తరలిస్తామని సెయింట్ జార్జి ఆసుపత్రి అధికార ప్రతినిధి తెలిపారు.