: కర్ణాటక తరువాత తెలంగాణలోనే పార్టీ బలంగా ఉంది: లక్ష్మణ్
తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో రెండంకెల ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. దక్షిణాదిన కర్ణాటక తరువాత తెలంగాణలోనే బీజేపీ బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా కష్టపడి ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగేలా చేయాలని, తద్వారా రానున్న ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆయన సూచించారు.