: సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే సమస్యలు తీరతాయా?: తమ్మినేని వీరభద్రం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే రాష్ట్రంలో సమస్యలు తీరతాయా? అని తెలంగాణ రాష్ట్ర సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో కరవు పర్యటనలో భాగంగా తిప్పర్తిలో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరవు ప్రకటించిన మండలాల్లో ప్రభుత్వం ఎటువంటి సహాక చర్యలు చేపట్టలేదని అన్నారు. ఇక్కడి సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు. ప్రతి మండలానికి కరవు సహాయం కింద రూ.10 కోట్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వివిధ కాంట్రాక్టులు పొంది, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ నెల 23న నల్గొండ కలెక్టరేట్ ను ముట్టడించనున్నట్లు తమ్మినేని పేర్కొన్నారు.