: రిగ్గింగ్ చేయించినందుకు ఎంత తీసుకున్నారు?: ప్రిసైడింగ్ అధికారితో బెంగాలీ సినీ నటి వాగ్వాదం

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి లాకెట్ ఛటర్జీ పోలింగ్ ఆపీసర్ పై వీరంగం వేశారు. బీర్భమ్ జిల్లా మయూరేశ్వరి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ కు వెళ్లారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆమె ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆమె ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లాకెట్ ఛటర్జీ అధికారివైపు వేలు చూపిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. పరుషపదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ నేతల నుంచి ఎంత తీసుకున్నావో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తతంగం మొత్తాన్ని బీజేపీ కార్యకర్తలతో వీడియో తీయించిన ఆమె ఎన్నికల సంఘానికి పంపుతానని తెలిపారు.

More Telugu News